జగిత్యాల: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
NEWS Oct 01,2024 12:12 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు వయోవృద్ధులను శాలువాతో సత్కరించి మేమెంటోలను, వయోవృద్ధుల చట్టం పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.