పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
NEWS Oct 01,2024 12:07 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పువ్వులను సేకరించి అందంగా బతుకమ్మలను రూపొందించారు. అనంతరం బతుకమ్మలను ఓ చోట ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.