హైదరాబాద్ పరిధిలో డీజేలు బ్యాన్
NEWS Oct 01,2024 10:03 am
హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే ఉపయోగించకూడదన్నారు. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని.. సౌండ్ సిస్టమ్‌కు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం కూడా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని సీపీ స్పష్టంచేశారు.