సాహో భారత్.. టెస్టుల్లోనే అద్భుతం!
NEWS Oct 01,2024 09:48 am
సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. వర్షం వల్ల 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా, మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఈ ఫీట్ సాధించింది. T20 తరహాలో 8కి పైగా రన్‌రేట్‌తో తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేసిన టీమిండియా.. ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేసి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. కాన్పూర్ టెస్టులోనూ గెలిచి.. టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.