ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఈనెల 3వరకు సిట్ దర్యాప్తు నిలిపివేత
NEWS Oct 01,2024 09:50 am
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి అంశంపై కోసం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈనెల 3న జరిగే విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని ఆయన తెలిపారు.