పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS Oct 01,2024 09:49 am
మడకశిర మండలం వైబిహళ్ళి పంచాయతీ కోడిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు మొహంలో చిరునవ్వు మందహాసం కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ,వైబి హళ్లి పంచాయతీ నాయకులు పాల్గొన్నారు .