రొళ్ల మండలంలో పెన్షన్ పంపిణీ
NEWS Oct 01,2024 09:23 am
రొళ్ల మండలం వన్నారనపల్లి గ్రామంలో రాష్ట్ర కుంచిటిగా ఒక్కలిగా సాధికార సమితి కన్వినర్ పాండురంగప్ప ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఆయన సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీయే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.