జగిత్యాల పట్టణంలోని నూర్ మసీదు ఎదురు గల్లీలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాస గృహ సముదాయాల మధ్యలో డంపింగ్ యార్డును తలపించేలా చెత్త పేరుకుపోయింది. వ్యాధులకు కారణమయ్యే ఈగలు, దోమలతో పాటు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.