గాయపడిన హోంగార్డును పరామర్శించిన హరీష్
NEWS Oct 01,2024 12:11 pm
మల్కాపూర్ చెరువులో భవనం కూల్చివేత సమయంలో గాయపడిన హోంగార్డు గోపాల్ ను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి హోంగార్డు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం లక్ష రూపాయల సహాయాన్ని అందించారు. హోంగార్డు గాయపడి 5 రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి పరామర్శించ లేదని, ఇది సరికాదన్నారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్నారు.