జంగిల్ రాణి షోలో తేజస్వీ మదివాడ
NEWS Oct 01,2024 08:21 am
డిస్కవరీ ఇండియా ఛానల్ రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ కార్యక్రమాన్ని ప్రతీ సోమ, మంగళవారాలు రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తోంది. మొత్తం 12 మంది మహిళా సెలబ్రెటీలు మాత్రమే పాల్గొనే ఈ షోలో భాగంగా అడవిలోనే ఉండాలి. ప్రమాదాలను ఎదుర్కొంటూ, అడవిలో దొరికే ఆహారాన్ని తీసుకుంటూ వివిధ టాస్కులు పూర్తి చేస్తూ పార్టిసిపెంట్లు ముందుకెళ్లాల్సి ఉంటుంది. తాజాగా ఈ షోలో తెలుగు హీరోయిన్ తేజస్వీ మదివాడ పాల్గొంటోంది.