ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు
NEWS Oct 01,2024 09:03 am
జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్సైలు రాంచంద్రం, మల్లేష్ వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనదారులను అపి ఫైన్ లు విధించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని సూచించారు.