లండన్‌లో పెద్దింటి నాటిక ప్రదర్శన
NEWS Oct 01,2024 07:47 am
ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పిల్లల కోసం రాసిన బుద్ది బలం అనే నాటిక లండన్‌లోని వకిహం జిల్లా విన్నర్స్ పట్టణంలో ప్రదర్శించారు. చిన్నారులు గరిపెల్లి శ్రద్ధ గరిపెల్లి శ్రేయ ప్రధాన పాత్రధారులుగా ఈ తెలంగాణ పౌరాణిక నాటిక ప్రదర్శన జరిగింది. తెలుగు విద్యార్థులు మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో లండన్‌లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు మన పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించడంపై పెద్దింటి కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.