శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం
NEWS Oct 01,2024 08:25 am
ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో 3 నుంచి శ్రీ విద్యా సరస్వతి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించారు. శ్రీ విద్యాదరి క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. 3న జరిగే ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి హాజరవుతానని మంత్రి తెలిపినట్లు వివరించారు.