అరసవల్లిలో అద్భుత దృశ్యం!
NEWS Oct 01,2024 04:58 am
శ్రీకాకుళం: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణ మూర్తిపై సూర్యభగవానుడి లేలేత సూర్య కిరణాల స్పర్శ తాకింది. దీంతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనిమిచ్చింది. ఉదయం 6:05 గంటలకు 2 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది ఈ అద్భుత దృశ్యం. రేపు మళ్లీ మూల విరాట్‌ను తాకుతాయి సూర్యకిరణాలు.