నేడు తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్
రేపు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
NEWS Oct 01,2024 04:22 am
తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తిరుమల వెళ్తున్నారు. రేణిగుంట నుండి అలిపిరి చేరుకుని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్తారు. రాత్రికి గాయత్రి సదన్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. రేపు రాత్రి తిరుమలలో బస చేసి.. ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు.