నవరాత్రి ఉత్సవాలకు MLAకు ఆహ్వానం
NEWS Oct 01,2024 04:47 am
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుకి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు స్వగ్రామమైన ఐతవరంలోని ఆయన నివాసంలో దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.