అప్సన్ పల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం
NEWS Oct 01,2024 08:24 am
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అక్సాన్ పల్లి గ్రామంలో మహేశ్వర మెడికల్ హాస్పిటల్ బృందం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా జరిగింది. ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు గ్రామ శివారులో గల తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించినట్టు కాంగ్రెస్ యువ నాయకులు వెంకట్ గౌడ్ తెలిపారు. గ్రామ ప్రజలు చుట్టుపక్క గ్రామాల వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.