తండ్రి నుంచి రక్షణ కావాలంటూ..
పోలీసుల ముందుకు 12 ఏళ్ల బాలిక
NEWS Oct 01,2024 04:57 am
గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు చెందిన బాలిక (12) తన గోడును జగిత్యాల టౌన్ పోలీసులకు విన్నవించుకుంది. గతంలో అనారోగ్యంతో తల్లి మృతి చెందింది, తండ్రి ఇంకొకరికి పెళ్లి చేసుకొని తనను పట్టించుకోవడం లేదని ఏడుస్తూ పోలీసుల వద్ద గోడు వెళ్లబోసుకుంది. స్పందించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు చెప్పడంతో వారు బాలికను సఖి కేంద్రానికి తరలించారు.