తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
NEWS Sep 30,2024 04:50 pm
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లడ్డూ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారా? నెయ్యి కల్తీపై రెండో సలహా తీసుకున్నారా? జూలైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్‌లో ఎందుకు చెప్పారు? కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండంటూ.. విచారణ అక్టోబర్ 3కి వాయిదా వేసింది.