సీడాప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దీపక్ రెడ్డి గుణపాటి
NEWS Sep 30,2024 04:34 pm
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న యువతను అందించేందుకు కృషి చేస్తామని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఈ మేరకు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు లక్ష్యం. సీడాప్ ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఈడీ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.