అమలాపురం: ప్రజా సమస్యలపై 230 అర్జీలు
NEWS Sep 30,2024 04:45 pm
అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి సమస్యలపై ప్రజల నుంచి 230 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, అధికారులు అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు.