మెట్‌పల్లి పాత బస్టాండ్ వెల్లుల్ల రోడ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఖాదీ స్థలంలో ప్రజల కోసం బస్ షెల్టర్ నిర్మిస్తామన్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొంత గందరగోళం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించారు. మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.