సమర్థవంతంగా పని చేయాలి: ఎస్పీ
NEWS Sep 30,2024 04:26 pm
జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్థవంతంగా పని చేయాలని కోరారు. అంతేకాకుండా సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్ధవంతమైన సేవలను అందించాలని సూచించారు.