బాలికను చిత్రహింసలకు గురిచేసిన దంపతులకు జీవిత ఖైదు
NEWS Sep 30,2024 04:29 pm
మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసి మరణానికి కారణమైన ఇద్దరికీ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పి రూపేష్ సోమవారం తెలిపారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ కు చెందిన జాకీర్ హుస్సేన్ ఆయన భార్య రజియా సుల్తానా 5 సంవత్సరాల బాలికను పనిలో పెట్టుకున్నారు. బాలికను చిత్రహింసలకు గురి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు కోర్టు విధించిందని చెప్పారు.