ఉత్తమ అధికారులకు ఎస్పీ ప్రశంసలు
NEWS Sep 30,2024 04:09 pm
జగిత్యాల విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిమ కనబరిచిన అధికారులకు ప్రశంసా ప్రోత్సాహకాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా ప్రధాన కార్యాలంలో అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించిన అధికారులను, రాజీ పడదగిన కేసులలో లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు కృషి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు.