హిందూపురంలో ఆటో - ట్రాక్టర్ ఢీ
NEWS Sep 30,2024 04:08 pm
హిందూపురం రూరల్ మండల పరిధిలోని LRG పబ్లిక్ స్కూల్ సమీపంలో హిందూపురం నుంచి తూమకుంట వైపు వెళుతున్న ఆటో, పెన్నా ఏరులో నుంచి హిందూపురం పట్టణం వైపు వస్తున్న ఇసుక ఇసుక ట్రాక్టర్ ఢీ కొని ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన ఆటో డ్రైవర్‌ను హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అప్ గ్రేడ్ స్టేషన్ పోలీసులు ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు.