బెస్ట్ టూరిస్ట్ గైడ్ విరుపన్నకు సత్కారం
NEWS Sep 30,2024 04:06 pm
లేపాక్షి మండల కేంద్రంలో అన్నదాన భవనంలో ఉత్తమ టూరిస్ట్ గైడ్ విరుపన్నకు కమిటీ సభ్యులు సత్కారం చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కమిటీ సభ్యులు రాంప్రసాద్ మాట్లాడుతూ.. లేపాక్షి వీరభద్రాలయంలో 20 ఏళ్ల పైబడి టూరిజం శాఖలో గైడ్‌గా పని చేస్తున్నారన్నారు. విరుపన్న తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పర్యాటకులకు ఆలయ చరిత్రను చక్కగా వినిపిస్తున్నారు. పర్యాటకులకు అందించిన సేవలను గుర్తించిన ఏపీ పర్యాటక శాఖ విరుపన్నను ఉత్తమ పర్యాటక గైడ్ గా ఎంపిక చేయడం హర్షదాయకమన్నారు.