దసరా ఉత్సవాల కరపత్రాలు విడుదల
NEWS Sep 30,2024 03:52 pm
ప్రపంచ పర్యాటక చిత్ర పటంలో ప్రసిద్ధిగాంచిన లేపాక్షి వీరభద్రాలయంలో అక్టోబర్ 3 నుండి నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం రామానందన్ మాట్లాడుతూ.. ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.