పదో తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్
NEWS Sep 30,2024 03:51 pm
జగిత్యాల పట్టణంలో సువిద్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని టీచర్ తీవ్రంగా కొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లో నిర్వహించిన పరీక్షలో సదరు విద్యార్థి కాపీకి పాల్పడ్డాడని వాతలు వచ్చేలా టీచర్ చితక బాధినట్టు తెలుస్తోంది. టీచర్‌పై, పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.