చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
NEWS Sep 30,2024 02:59 pm
టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర లిఖించారు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో 27వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లు కలిపి సచిన్ 623 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా విరాట్ 594 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్కును చేరుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ ఘనత సాధించింది విరాట్ ఒక్కరే. సచిన్, కోహ్లీతో పాటు రికీ పాంటింగ్, సంగక్కర కూడా 27వేల పరుగుల మైలురాయి దాటారు.