వృద్ధులకు వస్త్రాదరణ అందించిన ఎమ్మెల్యే
NEWS Sep 30,2024 03:49 pm
మడకశిర మండలం ఆమిదాల గొంది వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి చేతుల మీదుగా వృద్ధులకు ఉచిత వస్త్రధారణ చేశారు. గుర్రప్పకొండ గ్రామానికి చెందిన మాజీ డీలర్ రంగప్ప మనవడు హయాన్స్ జన్మదినం సందర్భంగా వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వస్త్ర దానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం వస్త్ర దానం చేయడం ఎంతో సుగుణం అన్నారు.