దసరాకు 5304 స్పెషల్ బస్సులు
NEWS Sep 30,2024 01:33 pm
దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని TGS ఆర్టీసీ 5304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. పండుగ సీజన్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. MGBS, JBS, LB నగర్, ఉప్పల్, సంతోష్ నగర్, KPHB నుంచి ప్రత్యేక RTC బస్సులు బయలుదేరుతాయన్నారు.