ఎంబిబిఎస్ విద్యార్థికి అభినందనలు
NEWS Sep 30,2024 03:48 pm
కథలాపూర్ మండలంలోని బుషన్‌రావుపేట గ్రామానికి చెందిన సాయి చరణ్ కు ఎంబిబిఎస్‌లో సీట్ రావడంతో ఆ గ్రామస్తులు సాయి చరణ్‌ను సత్కరించారు. జిల్లా రైతు నాయకులు గడ్డం భూమి రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపాలని అప్పుడే అత్యున్నత స్థానానికి వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వామి రెడ్డి, సుల్తాన్, జగన్, భూమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.