స్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
NEWS Sep 30,2024 01:49 pm
మెట్‌పల్లి పట్టణంలోని వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు, వాటి విలువలు తెలిపే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకుంటారు. స్కూల్‌లకు దసరా సెలవులు ఉంటాయని, విద్యార్థులు, ఉపాధ్యాయులతో బతుకమ్మ సంబరాలు ముందస్తుగా నిర్వహించామని డైరెక్టర్ శ్రీహరి, కరస్పాండెంట్ వేణుగోపాల్ తెలిపారు.