బాబు, పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ ట్వీట్!
NEWS Sep 30,2024 01:12 pm
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందన్నారు. ల్యాబ్ రిపోర్ట్ సవివరంగా లేదని, అలాంటప్పుడు మీరు నేరుగా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన విషయాన్ని పేర్కొన్నారు.