నిజాయితీ గల వారికే పట్టం కడదాం
NEWS Sep 30,2024 01:44 pm
నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యల పట్ల అవగాహన ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే నీతి నిజాయితీ, స్వార్థం లేని వారినే పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలిపిద్దామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేశి పెద్ది శ్రీధర్ రాజు అన్నారు. సోమవారం కోరుట్ల పట్టణంలోని రామ కృష్ణ డిగ్రీ కళాశాలలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ పాల్గొన్నారు.