అదనపు బస్సు కేటాయించాలంటూ వినతి
NEWS Sep 30,2024 03:44 pm
మల్యాల: జగిత్యాల నుండి వయా మల్యాల మీదుగా హైద్రాబాద్ వెళ్లే బస్సులో మల్యాల ప్రజలకు గతంలో కేటాయించిన 4 సీట్లు అందుబాటులో ఉండగా, అవి సరిపోవడం లేదని, అదనంగా మరో 10 సీట్లను కేటాయించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు జగిత్యాల జిల్లా డిఎం సునీత కు వినతి పత్రం అందజేశారు. అలాగే మల్యాల నుండి జగిత్యాలకు మరో అదనపు బస్సు కేటాయించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో దూస వెంకన్న, నల్లపు మల్లేశం, మారుతి తదితరులు ఉన్నారు.