కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
ముందస్తు బతుకమ్మ సంబురాలు
NEWS Sep 30,2024 12:56 pm
కోరుట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలతో అలరించారు. ఇందులో భాగంగా అందంగా తయారు చేసిన బతుకమ్మలలో ఉత్తమ బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఇన్. సాందీప్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ ఈ. రాజకుమార్, IQAC కోఆర్డినేటర్ డా. డి. సుఖప్రదాదేవి, తదితరులు పాల్గొన్నారు.