పోషణ మాస మహోత్సవ కార్యక్రమం
NEWS Sep 30,2024 02:02 pm
సారంగాపూర్: స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సారంగాపూర్ మండలం రెచపెల్లి గ్రామపంచాయతీ ఐసిడిఎస్ సూపర్ వైజర్ శైలజ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మహోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికై తల్లుల, గర్భిణీ స్త్రీలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తల్లులకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. తగు జాగ్రత్తల గురించి తల్లులకు వివరించారు.