స్వచ్ఛత హి సేవలో యువకులు పాల్గొనాలి
NEWS Sep 30,2024 03:41 pm
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చత హి సేవ కార్యక్రమంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ కోరారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది స్థానిక యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రత్నాకర్, ముజీబ్, అశోక్, నిజాం తదితరులు పాల్గొన్నారు.