మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం
NEWS Sep 30,2024 11:38 am
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఛైర్పర్సన్ అడువాల జ్యోతి అధ్యక్షతన జరిగిన సెప్టెంబర్-2024 కౌన్సిల్ సర్వ సభ్య అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జగిత్యాల పట్టణంలో రాబోవు బతుకమ్మ, దసరా పండుగల సందర్భముగా ఏర్పాటు చేసే సౌకర్యాలు, వీది కుక్కల నియంత్రణ, పలు వివిధ అంశాలపై చర్చ జరిగిందని చైర్ పర్సన్ జ్యోతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మున్సిపల్ సమ్మయ్య, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.