చెరువు కబ్జా కాకుండా కాపాడాలి
NEWS Sep 30,2024 01:53 pm
జగిత్యాల పట్టణ శివారులోని కండ్లపల్లి చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే వాటిని తొలగించాలని గంగపుత్రులు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబ్జాదారులు చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందన్నారు. అధికారులు స్పందించి వెంటనే నిర్మాణాలను తొలగించి చెరువులని కాపాడాలని కోరారు.