చేనేత కార్మికుడి మృతిపట్ల సంతాపం
NEWS Sep 30,2024 02:01 pm
చేనేత కార్మికుడు కుందాల నాగయ్య మృతిపట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షులు వరకల అశోక్ విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం, సానుభూతి తెలిపారు. కుల పెద్దలతో కలిసి మార్కండేయ నగర్ కాలనీలోని ఇంటి వద్దకు వెళ్లి మృతదేహానికి సంతాపాన్ని తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలు నిమిత్తం ఐదు వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు.