ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి
NEWS Sep 30,2024 11:43 am
సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని ఆదేశించారు.మొత్తం 102 వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.