ప్రజావాణి సమస్యలను పరిష్కార మార్గం
NEWS Sep 30,2024 11:41 am
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను స్వతర పరిష్కార మార్గం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీవోలతో కలసి స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సుదూరాతీరం నుండి ఆర్జీదారులు తమ సమస్య చెప్పుకునేందుకు వస్తారని వారికి భరోసా కల్పించటం బాధ్యతగా భావించాలన్నారు. ఆయన వెంట కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలున్నారు.