వరద బాధితులకు రామ్ కో చేయూత
NEWS Sep 30,2024 11:42 am
మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. రామ్ కో ఇండ్రస్టీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన సుమారు 700 మంది వరద బాధిత కుటుంబాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు నిత్యవసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు.