అధికారుల సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
NEWS Sep 30,2024 01:56 pm
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ASI వాలి బెగ్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్య పదవి విరమణ సందర్బంగా వారిని పులమాలలతో సత్కరించి జ్ఞాపికను అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. పదవి విరమణ పొందిన అధికారుల అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు.