వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ
NEWS Sep 30,2024 11:46 am
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరిస్తామని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామన్నారు.