కలెక్టర్ కార్యాలయం ముందు వీహెచ్ పీ ధర్నా
NEWS Sep 30,2024 11:49 am
తిరుమల కల్తీ లడ్డూను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్ మాట్లాడుతూ.. తిరుమల కల్తీ లడ్డూ కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రాజేశ్వరరావు దేశ్పాండే, డాక్టర్ అరుణ, వెంకట నరసింహారెడ్డి ద్వారకా రవి పాల్గొన్నారు.