ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
NEWS Sep 30,2024 11:50 am
అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రజలకు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదవ తరగతికి 289, ఇంటర్మీడియట్ కు 700 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యార్థి గారి వెంకటేశ్వర్లు, ఓపెన్ స్కూల్ సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.